Sreeleela: కఠినమైన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఆశ్చర్యపోతున్న అభిమానులు..!

Sun, 11 Aug 2024-8:31 am,

రాఘవేంద్రరావు దర్శకత్వంలో.. శ్రీకాంత్ కొడుకు రోషన్.. హీరోగా చేసిన పెళ్లి సందడి.. సినిమా ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను.. సంపాదించుకున్న ఈ హీరోయిన్.. ఆ తర్వాత రవితేజ ధమాకా.. చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

అందుకు ముఖ్య కారణం రవితేజ ధమాకా.. చిత్రంలో..శ్రీలీల డాన్స్ కి లుక్స్ కి.. వందకి వంద మార్కులు.. పడడంతో.. వరుసగా తొమ్మిది సినిమా అవకాశాలు అందుకుంది. ఒకేసారి 9 అవకాశాలు.. రావడంపై అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో చర్చ జరిగింది. అయితే ఆ తొమ్మిది సినిమాలలో కేవలం ఒకటి, రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి.

ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి సినిమాతో..నటన పరంగా తానేంటో ప్రూవ్ చేసుకుంది.. ఈ హీరోయిన్. అయితే శ్రీలీలకి వరస ప్లాపులు రావడంతో.. అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. 

ఈ క్రమంలో ఈ హీరోయిన్.. ఐటమ్ సాంగ్స్ లో కనిపించనుంది అని వార్తలు రాగా.. దీనికి తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది శ్రీలీల. కొంతమంది దర్శకులు కూడా శ్రీలీలని ఐటమ్ సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారట.. కానీ ఎందుక‌నో సెట్ అవ్వ‌లేదు. 

తాజాగా ఈ విషయం గురించి శ్రీ లీలా మాట్లాడుతూ. 'ఇప్పుడ‌ప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచ‌న లేదు. అలాగని వాటిలో న‌టించ‌న‌ని.. నేను చెప్పడం లేదు. ఆ పాట‌లు చేసే స‌మ‌యం ఇంకా నాకు రాలేదు. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చేస్తా. ప్ర‌స్తుతం నా దృష్టంతా మంచి పాత్ర‌లు , క‌థ‌లు ఎంపిక చేసుకోవ‌డంపైనే పెట్టాను’ అని చెప్పకోచ్చింది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link