Sreeleela: బ్లాక్ డ్రెస్సులో శ్రీలీల.. బోల్డ్ ఫోజులు.. ఎప్పుడు ఇలా చూసి ఉండరు!
తెలుగులో వరసగా ఒకేసారి 9 సినిమా అవకాశాలు అందుకొని.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది శ్రీ లీల. తెలుగమ్మాయికి ఇన్ని సినిమాలు రావడం అంటే గొప్ప విషయమే అని.. అప్పట్లో శ్రీ లీల అభిమానులు ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.
మొదటి సినిమా పెళ్లి సందడితో మంచి విషయం అందుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత ధమాకాతో నిజంగానే ధమాకా కొట్టింది. ధమాకా సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించి..వరస అవకాశాలు అందుకుంది. ఇక టాలీవుడ్ కి స్టార్ హీరోయిన్ దొరికినట్టే..అని అందరి దగ్గర అనిపించకుంది.
కానీ దురదృష్టవశాత్తు శ్రీలీల.. నటించిన 9 సినిమాలలో ఒకటి, రెండు చిత్రాలు. మాత్రమే విజయం అందుకున్నాయి. దాంతో శ్రీ లీల ఇక కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే.. ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. అందుకే ఈ మధ్య వరస పెట్టి సినిమాలు ఒప్పుకోలేదు.
ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీలీల.. చేతిలో.. కేవలం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. రవితేజ సినిమాలు మాత్రమే ఉన్నాయి. తమిళంలో కూడా శ్రీలీల త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు. నిజమో తెలియాలి అంతే కొద్ది రోజులు వేచి చూడాలి.
ఈ క్రమంలో శ్రీలీల.. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో బ్లాక్ డ్రెస్సులో తెగ స్టైలిష్ గా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకునేలా ఫోజులు ఇచ్చింది ఈ హీరోయిన్.