Sreeleela: పుష్ప -2 లో శ్రీ లీల ఐటెం సాంగ్ రెమ్యునరేషన్ .. సమంత కంటే ఎక్కువ లేదా తక్కువ..?
యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
అంతేకాదు ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది శ్రీ లీల. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప -2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఎంపికయింది.
ఇప్పటికే ఈ పాటలో నర్తించడానికి చాలామంది హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరిగా ఈమె పేరు కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే ఇక్కడ ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీలా పారితోషకం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సమంత రూ.5 కోట్లు తీసుకుంది. శ్రీ లీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం కేవలం రూ .2కోట్లు మాత్రమే పారితోషకం తీసుకోబోతుందని సమాచారం.
ఇకపోతే ప్రస్తుత జనరేషన్ లో సమంత కంటే శ్రీ లీలాకి తక్కువ పారితోషికం ఇచ్చారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.