Sreeleela: ప్రేమలో పడ్డ శ్రీలీల.. ముద్దులతో పబ్లిక్ లో.. యవ్వారం అంతవరకూ వచ్చిందా?

Fri, 20 Sep 2024-2:56 pm,

ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శక పరివేక్షణలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ అందుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన మూవీ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకుంది.   

ఈ సినిమా అందించిన స్టేటస్ తో ఈమె ఏకంగా ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి,  ఒకే ఏడాది అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈమె నటించిన ఏ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు.   

ఇకపోతే బాలకృష్ణ తో కలిసి భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురుగా నటించింది కానీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం బాలయ్యకే వెళ్లిపోయింది. ఇక తర్వాత మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. 

ప్రస్తుతం తన వైద్య చదువు పైన ఫోకస్ పెట్టిన శ్రీ లీల మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.  అందులో భాగంగానే తాజాగా ప్రేమలో పడినట్లు సమాచారం.   

తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఈమె అందులో ఒక నెటిజన్ ఐ లవ్ యు అంటూ కామెంట్ పెట్టారు. దానికి శ్రీ లీల.. ఉమ్ ఆ.. ఉమ్ ఆ.. ఐ లవ్ యు అంటూ ముద్దులతో రిప్లై ఇచ్చింది. శ్రీ లీల ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.   

ఇది చూసిన అభిమానులు పబ్లిక్ లో ఇలా నెటిజన్స్ తో ముద్దులతో రెచ్చిపోతుంది యవ్వారం ఎంతవరకు వచ్చింది అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే అభిమానులతో ప్రేమలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చదువు పైన దృష్టి పెట్టిన శ్రీ లీల .. మరోవైపు మళ్లీ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link