Sri Rama Navami 2024 Special Quotes: శ్రీరాముడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురువు.. ఆయనలో ఉన్న ఈ ఆదర్శాలు తెలుసా..!

Mon, 15 Apr 2024-2:11 pm,

ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం ఇది శ్రీ రాముడి ఆదర్శాల్లో ఒకటి.  ఏ కాలంలోనైనా ఉత్తమ జీవనాన్ని కొనసాగించాలంటే స్ఫూర్తి ప్రదాతలు  అవసరం. 'ద కంప్లీట్ మ్యాన్' ఎలా వుండాలనడానికి రాముడికి మించిన ఉదాహరణ లేదు.

ఆదర్శంగా జీవించడమంటే.. కష్టనష్టాలను సమానంగా స్వీకరించడం. అంతేకాదు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోడం. ప్రెజెంట్ యూత్ విషయం అందరికీ తెలిసిందే. లెక్కలేనన్ని ఒత్తిళ్లు, అనేక దుష్ప్రభావాలు. రాముడిని ఫాలో అవ్వాలేకానీ, ఏ బ్యాడ్ ఎఫెక్ట్స్, ప్రెషర్స్ ఏం చెయ్యలేవు. వాటిని ఇట్టే తరిమి కొట్టొచ్చు.

రాముడంటే పిత్రువాక్ పరిపాలకుడు, ఏకపత్నీ వ్రతుడు, పరిపాలనాదక్షుడు అన్న పేరుంది. శూర్పణక తనపై మనసు పారేసుకున్నప్పుడు అందుకు చలించక తానేంటో నిరూపించాడు రాముడు. అంతేకాదు వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం కోసం.. ఎన్ని ఇబ్బందులైనా  అధిగమించాల్సి వుంటుందని చెబుతుంది రామతత్త్వం.

మారీచుడు రాముడి శత్రువర్గానికి చెందిన వాడు. అలాంటివాడే 'రామో విగ్రహవాన్ ధర్మః' అంటాడు. అంతటి నిజాయితీ రాముడి సొంతం. వాల్మీకి రాముడు గొప్పవాడని వర్ణించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందనే వారున్నారు. వారి మాటలను కొందరు ఒప్పుకుంటారు కూడా. ఎందుకంటే మంచో చెడో.. రాముడి గుణగణాలను విశ్లేషించడం అంటే రాముడ్ని ఒప్పుకున్నట్టే.

రాముడి గుణగణాలు ఇప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. రామాయణం కేవలం కథే కావచ్చుగాక. అదొక జీవన సారం. నాటి నుంచి నేటి వరకూ జాతి సంస్కృతీ సంప్రదాయాలను రామాయణం ప్రభావితం చేస్తూనే వుంది.

మనమిప్పుడు ప్రజాస్వామ్యంలో వున్నాం. కానీ రాముడు, రామరాజ్యం రాచరికానికి చెందిన విషయాలు. అయినా సరే ఇప్పటికీ అవే ఆదర్శప్రాయం. ఇప్పటికీ ప్రతి పాలకుడు రామ రాజ్యం స్థాపన చేస్తామంటుంటారు.

 

ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటే దాన్ని రామరాజ్యంగా అభివర్ణిస్తారు. ఆయన ధర్మం కర్తవ్యపాలన ఇప్పటి కాలానికి ఎంతో అవసరం.. కృష్ణుడ్ని మేనేజ్ మెంట్ గురుగా భావించడం ఎంత కరెక్టో.. రాముడ్ని పర్శనాలిటీ డెవలప్ మెంట్ గురువుగా భావించడం అంతే కరెక్టు.

ఇంకోవైపు నవమి వేడుకలు కాబోయే దంపతులకు ఆహ్వానం పలుకుతాయి. శ్రీరామనవమి నుంచే పెళ్లి ముహూర్తాలు ఊపందుకుంటాయి. ఆదర్శ పురుషుడి కల్యాణంతోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం అన్ని విధాలా శుభ సూచకంగా భావిస్తారు.

అటు ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు.. ఇటు వినోదం, ఆరోగ్యం, చక్కటి కుటుంబ వ్యవస్థ, సామాజిక ఐక్యతల కలబోతగా నిలుస్తుంది శ్రీరామనవమి. ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి కాబట్టే రాముడూ, రామాయణం నేటికీ నిలిచి వున్నాయి. తరాలెన్ని గడిచినా తరగని గుణాలు శ్రీరాముడి సొంతం. ఆయన వ్యక్తిత్వ ప్రేరణతో ముందుకు నడిచేందుకు రామనవమి సరైన సందర్భం. జీవితంలో మార్పుకు నాంది పలికేందుకు ఇదే శుభ తరుణం.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link