Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..

Mon, 12 Aug 2024-12:40 pm,

మొత్తంగా శ్రీదేవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో కొన్ని చిత్రాలను మాత్రమే ప్రస్తావించాము. మరోవైపు ఈమెకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

జగదేకవీరుడు అతిలోకసుందరి: కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి, శ్రీదేవి టైటిల్ రోల్స్ లో నటించిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కమ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిపోయింది.

ఆఖరి పోరాటం: వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘ఆఖరి పోరాటం’. ఈ సినిమాలో శ్రీదేవి హీరోతో సమానమైన పాత్ర చేసింది. సినిమా మొత్తం ఆమె భుజస్కందాలపైనే నడుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

త్రిశూలం :

రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘త్రిశూలం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.

దేవత: కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో శోభన్ బాబు హీరోగా శ్రీదేవి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘దేవత’. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

కిరాయి కోటీగాడు: సూపర్ స్టార్ కృష్ణతో శ్రీదేవి ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. అందులో పలు హిట్ చిత్రాలున్నాయి. అందులో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘కిరాయి కోటీగాడు’సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ప్రేమాభిషేకం : హీరోగా అక్కినేని నాగేశ్వరరావు పనైపోయింది ఆయన కథానాయకుడిగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అనే టైములో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించిన సినిమా ‘ప్రేమాభిషేకం’. ఈ సినిమా పలు కేంద్రాల్లో యేడాదికి పైగా నడిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

బొబ్బిలి పులి:

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు రికార్డులను తిరగరాసింది.

 

వేటగాడు: అన్న ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆయన సరసన కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘వేటగాడు’. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

పదహారేళ్ల వయసు : కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్ బాబు హీరోలుగా నటించిన సినిమా ‘పదరాహారేళ్ల వయసు’. ఈ చిత్రం శ్రీదేవి కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అతిలోకసుందరి వెనుదిరిగి చూసుకోలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link