Shriya: గోల్డ్ రంగు చీరలో నిగనిగలాడిన శ్రియ.. వయసు ఎప్పుడు పాతికే..

Mon, 15 Jan 2024-7:28 pm,

Shriya Saran: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. ఆ తరువాత సంతోషం, నువ్వే నువ్వే, చెన్నకేశవరెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.  

తెలుగు ఇండస్ట్రీలో శ్రియ నటించిన హీరో లేదు అన్నడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి దగ్గర నుంచి మహేష్ బాబు వరకు…బాలకృష్ణ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. తరుణ్ దగ్గర నుంచి రాజా వరకు అందరూ హీరోలతో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్.

ఈమధ్య రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పుడు క్యారెక్టర్ కి తల్లిగా కనిపించింది. కాగా శ్రియ తెలుగులో చివరగా కనిపించిన సినిమా ఇదే.

అయితే నాలుగు పదులు దాటినా కానీ శ్రియా వయస్సు ఇప్పటికీ పాతికేళ్లు లాగే కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యార్థకం. ఇప్పటికీ శ్రియ అని హీరోయిన్గా తీసుకుంటే తెలుగు ప్రేక్షకులు తప్పక చూస్తారు.

దాదాపు అన్ని ఇండస్ట్రీలలో ఆఖరికి హాలీవుడ్లో సైతం నటించిన శ్రియకి ఎక్కువ అభిమానులు ఉండేది మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే. అందుకే శ్రియా మళ్లీ ఎప్పుడు తెలుగు సినిమాలో కనిపిస్తుందని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ మధ్య శ్రియ అమీర్ ఖాన్ కూతురు రిసెప్షన్ లో తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గోల్డ్ శారీలో మెరిసిపోతూ కనిపించింది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link