Adivi Sesh: ఇద్దరు హీరోయిన్స్ అవుట్.. అడివి శేష్ కే ఎందుకిలా.?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు దక్కించుకున్న అడవి శేష్ (Adivi shesh) ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
ఇక ఇప్పుడు మేజర్, హిట్ -2 వంటి చిత్రాల తర్వాత తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం డెకాయిట్. మరోవైపు గూఢచారి 2 సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఇకపోతే గూఢచారి -2 సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అయినా అంతకంతకు ఆలస్యం అవుతోంది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ బనిత సంధు ను హీరోయిన్గా అనుకున్నారు. అయితే ఆమె మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది.మరొకవైపు డెకాయిట్ సినిమా నుంచి శృతిహాసన్ కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ కుర్ర హీరో మూవీస్ నుంచి హీరోయిన్లు ఇలా తప్పుకోవడంతో రకరకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ హీరో వ్యవహారం నచ్చకే బయటకి వస్తున్నారని కొంతమంది కామెంట్లు చేయగా, మరికొంతమంది క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే అని, ఇంకొంతమంది డేట్స్ సమస్యల వల్ల అంటూ ఇలా ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు వినిపిస్తున్నారు.
మరొకవైపు ఇలా అడివి శేష్ సినిమాల నుంచి హీరోయిన్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈయన చిత్రాలకు మును ముందు హీరోయిన్లు లభిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.