Chanakya Niti: మగవాళ్లు ఎక్కువ శాతం ఇతర స్త్రీలకు ఎందుకు ఆకర్షితులవుతారు? ఈ 5 వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు..

Chanakya Niti Marital Affair: చాణక్యుడు నీతిశాస్త్రంలో మనం అనుసరించాల్సిన నియమాలను, భార్యాభర్తల మధ్య సంబంధం, సమాజంలో మెలగడం గురించి అనేక విషయాలను చెప్పారు. అయితే, అలాగే ఎక్కువ శాతం పురుషులు భార్య ఉన్నా ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారు. దీనికి ఓ 5 కారణాలు చెప్పారు. దీనివల్ల వారు ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

వివాహం అయిన కొత్తలో ఇద్దరూ బాగా కలిసి పోతారు. కానీ, స్త్రీలు బిడ్డ పుట్టిన తర్వాత పిల్లలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఈ నేపథ్యంలో వారు భర్తతో ఎక్కువ సమయం కేటాయించలేరు. అర్థం చేసుకుంటే సరే.. కానీ, కొంతమంది మగవాళ్లు ఆ సమయంలో కూడా ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారు.  

2 /5

ముఖ్యంగా పెళ్లి అంటే ఒకరినొకరు జీవితాంతం కలిసి అడుగులు వేయడం. అయితే, ఈ ప్రేమలో ఎప్పటికీ స్థిరత్వం కూడా ఉండాలి. ఒకరి మనస్సు ఇంకొకరు అర్థం చేసుకోవాలి. లేకుండా కొంతమంది స్త్రీలు లేదా పురుషులు ఇతరులకు ఆకర్షితులవుతారు.  

3 /5

అంతేకాదు భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరకపోతే కూడా ఈ వివాహేతర సంబంధాలకు ప్రధాన కారణం అవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి భేదాలు రాకూడదు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది విడిపోయే వరకు కూడా దారితీస్తుంది. అందుకే వైవాహిక జీవితంలో నమ్మకం కూడా తప్పనిసరి.  

4 /5

వైవాహిక జీవితంలో ఆకర్షణ కూడా ఎంతో ముఖ్యం. ఒకరిపై ఒకరికి ఆసక్తి, ఆకర్షణ, శారీరక సంతృప్తి లేకుంటే కూడా సంబంధంలో చీలికలకు కారణమవుతుంది. ఏ గొడవలు వచ్చినా ఇద్దరు సర్దుకోవడానికి ప్రయత్నించాలి.  

5 /5

 అంతేకాదు వైవాహిక జీవితంలో ఏ తప్పులు దొర్లకుండా ఉండాలంటే కూడా చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకోకూడదు. ముఖ్యంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరిన తర్వాతే వివాహం చేసుకోవాలి. అప్పుడే వైవాహిక జీవితంలో ఏ సమస్యలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)