SS Thaman: తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎక్కడంటే..?

Tue, 21 May 2024-2:54 pm,

ఎప్పుడు సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉండే తమన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అమెరికాలోని డల్లాస్‌లో అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది.   

స్పెస్ టూర్‌తో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. జూన్ 1న ప్రారంభంకానుంది.   

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాను ప్రోమోలో చూపించారు. డల్లాస్‌లో ఇప్పటివరకు ఇప్పటివరకు ఎప్పుడు జరగని భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.   

మరోవైపు తమన్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ తమిళ సినిమాలో గెస్ట్ రోల్‌లో తమన్ కనిపించనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ యూట్యూబ్ స్టార్ నిహారిక నటిస్తుండగా.. తమన్ చాలా రోజుల తరువాత బిగ్ స్క్రీన్‌పై మెరవనున్నారని తెలుస్తోంది. తమన్ కెరీర్ ఆరంభంలో బాయ్స్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.   

ఇక తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద త్వరలోనే సందడి చేయనున్నాయి. పవన్ కళ్యాణ్‌ ఓజీ, రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్, NBK 109, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ RT4GM, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న AA22 మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వీటితోపాటు తమిళ సినిమాలతో కూడా ఆడియన్స్‌ను అలరించనున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link