SSB Constables Recruitment 2020: ఎస్ఎస్‌బిలో 1522 ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..

Thu, 10 Dec 2020-6:52 pm,

సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం మ్యాట్రిక్స్-3 లెవెల్‌కి అనుగుణంగా రూ 21,700 నుంచి రూ 69,100 వేతనం లభిస్తుంది. వేతనంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్‌, రేషన్ మనీ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్ ( Dearness allowance, Ration Money Allowance and Washing allowance ) కూడా కూడా అందనుంది. న్యూ పెన్షన్ స్కీమ్ వర్తించనుండటం వల్లే వారికి ఈ అలవెన్సులు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

SSB Constable Recruitment 2020 age limit and age relaxation: వయస్సు పరిమితి, మినహాయింపులు ఏంటి ? 27 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు మినహాయింపు ఉంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SSB Constable Recruitment 2020 application fee: ఎస్ఎస్‌బీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ అప్లికేషన్ ఫీజు వివరాలు.. అన్ రిజర్వ్‌డ్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వారు, ఓబీసీ ( UR, EWS, OBC ) వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ( Image courtesy : PTI )

నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ( Net banking, Debit card /  credit card ) దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. 

SSB Constable Recruitment 2020 qualification: ఎస్ఎస్‌బీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అర్హతలు.. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు పోస్టుల వారీగా పలు ట్రేడ్ టెస్టులలో సర్టిఫికెట్ కలిగి ఉండటం, వృత్తిలో రెండేళ్ల అనుభవం వంటివి అవసరం. ( Image courtesy : PTI )

Also read : Christmas Star: ఆకాశంలో అరుదైన క్రిస్మస్ స్టార్.. ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడో

Also read : Did Sonu Sood mortgage his properties: నిరుపేదలకు సాయం చేసేందుకు సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడా ?

Also read : Side effects of Vitamin D Tablets: కరోనాకు చెక్ పెట్టేందుకు విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link