SSC CHSL Tier I Result 2024: SSC CHSL టైర్‌ I ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..

Sat, 07 Sep 2024-9:01 am,

2024 జూలై 1వ తేదీ టైర్‌ I పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. అధికారికంగా కేటగిరీ ప్రకారం కటాఫ్‌ మార్కులు తీసి వేసిన తర్వాత అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఈ ఫలితాలతోపాటు టైర్‌ II పరీక్ష వివరాలను విడుదల చేశారు.   

మొత్తం 39835 అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (LDC)/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (DEO) కానీ, ఈ అభ్యర్థులు టైర్‌ II ఎగ్జామ్‌ కూడా పాసవ్వాల్సి ఉంటుంది.  

SSC CHSL Tier I Result 2024 ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి.. ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత హోంపేజీలోని లింక్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. SSC CHSL Tier I Result 2024 list 1,2 పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత కొత్త పీడీఎఫ్ ఓపెన్‌ చేసి వారి రోల్‌నంబర్‌, ఇతర వివరాలతో చెక్‌ చేసుకోవచ్చు. ఓ హార్డ్‌కాపీని భవిష్యత్తు అవసరాల నిమిత్తం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ పరీక్షకు సంబంధించిన మార్కుల, జవాబు కీని త్వరలన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో అర్హత సాధించిన, సాధించలేనివారి వివరాలు ఉంటాయి.

టైర్‌ II పరీక్ష వివరాలు కూడా త్వరలోనే అందుబాటులో ఉంచారు. SSC CHSL Tier 1 పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Computer Based Test) విధానంలో నిర్వహిస్తారు. 3,712 ఖాళీలను వివిధ డిపార్టుమెంట్లలో భర్తీ చేయనున్నారు.  మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించాలి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link