Nayanthara: ధనుష్ గొడవ విషయంలో నయనతారకు అండగా స్టార్ హీరోయిన్స్..!
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. కష్టానికి ప్రతిఫలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఒక ట్రైలర్ ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ చూసిన ధనుష్.. నయనతారకు లీగల్ నోటీసులు పంపిస్తూ రూ .10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార హీరోగా నటించిన ధనుష్ నిర్మించిన చిత్రం నానుమ్ రౌడీధాన్ (2015). అయితే ఈ సినిమాలో కొన్ని ఫోటోలను తీసుకొని డాక్యుమెంటరీలో పెట్టుకుంటానని, ధనుష్ ను రెండేళ్లుగా NOC కోసం నయనతార ప్రయత్నించింది. కానీ ఆ క్లిప్స్ ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు.
దీంతో తన చిత్రంలోది కాబట్టి ఆమె తన డాక్యుమెంటరీలో ఆ సినిమాకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకుంది ఈ ట్రైలర్లో మూడు సెకండ్ల నిడివి ఉండడంతో తన అనుమతి లేకుండా తన సినిమాలోని ఫోటోలు ఉపయోగించారని, నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు ధనుష్.
ఈ విషయంపై మండిపడిన నయనతార దాదాపు మూడు పేజీలు ఉన్న ఒక సుదీర్ఘ పోస్ట్ విడుదల చేసింది. మీరు మీ తండ్రి, సోదరుడి సహాయంతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. నేను మాత్రం నా సొంత కష్టంతోనే ఇండస్ట్రీలో ఎదిగాను. ఇప్పుడు నా కష్టాన్ని గమనించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేస్తోంది. ఇప్పటివరకు నేను ఎన్నో సినిమాలలో నటించాను. ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంటరీ కోసం సహాయపడ్డారు. కానీ మీరు మాత్రం పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు.
ముఖ్యంగా మూడు సెకండ్ల నిడివి ఉన్న ఫోటో కోసం మీరు పది కోట్లు డిమాండ్ చేయడం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అంటూ నయనతార తెలిపింది. ఈ క్రమంలోని ధనుష్ తో పనిచేసిన చాలామంది హీరోయిన్స్ నయనతారకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, పార్వతి, ఐశ్వర్య లక్ష్మి తదితర హీరోయిన్స్ నయనతారకు అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.