India-Canada: కెనడా పౌరులుగా ఉంటూ భారత్లో సెలబ్రెటీలుగా చెలామణి అవుతున్న స్టార్స్ వీళ్లే
India-Canada Dispute : భారత్ కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖలిస్తాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మతోపాటు ఇతర దౌత్య సిబ్బందిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ సైతం మన దేశంలోనే కెనడా రాయబారులను వెనక్కు పంపింది. దీంతో ప్రస్తుతం భారతదేశంలో కెనడియన్ పౌరసత్వం ఉన్న ప్రముఖ సెలబ్రిటీల గురించి ఇఫ్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది.
బాహుబలి చిత్రంలో ప్రభాస్ సరసన ఇరుక్కుపో హత్తుకొని ధీర ధీర అంటూ హొయలు ఒలికిన భామ నోరా ఫతేహి. ఈ అమ్మడు కెనడా పౌరసత్వం కలిగి ఉంది. బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఐటం డ్యాన్సర్‌లలో ఒకరిగా తనకంటూ ఒక హోదాను నోరా ఫతేహీ పొందింది. నోరా ఫతేహి డాన్స్ ప్లస్, డాన్స్ దీవానే , ఝలక్ దిఖ్లా జా వంటి అనేక విజయవంతమైన టెలివిజన్ రియాలిటీ షోలలో సైతం జడ్జిగా పాల్గొన్నారు.
ప్రముఖ హీరోయిన్, ఐటమ్ భామ సన్నీ లియోన్ సైతం కెనడాలో పుట్టి పెరిగిన పౌరురాలు. 2011లో సన్నీ బిగ్ బాస్ 5 లో పాల్గొని భారతదేశంలో సెలబ్రిటీగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె మహేష్ భట్ నిర్మించిన జిస్మ్ 2 లో కనిపించి బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు.
పంజాబీ చిత్ర పరిశ్రమకు చెందిన నీరు బజ్వా వాళ్ళు పంజాబీ సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోను కనిపించారు. కానీ ఆమెకు కెనడియన్ పౌరసత్వం ఉందని కొద్ది మందికి మాత్రమే తెలుసు.
మహేష్ బాబు సరసన టక్కరి దొంగ సినిమాలో నటించిన లిసా రే బాలీవుడ్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. కెనడాలో పుట్టి పెరిగిన ఈ నటికి కెనడియన్ పౌరసత్వం ఉంది.
కాళీ మా, మూడ్స్ ఆఫ్ క్రైమ్, లవ్ కా ది ఎండ్ వంటి చిత్రాలలో పనిచేసిన ఉపేఖా జైన్ కూడా కెనడియన్ పౌరురాలు. ఆమె టెలివిజన్ షో సాథ్ నిభానా సాథియాలో ఒక ప్రముఖ పాత్రలో నటించి ప్రేక్షకుల అభిమానం చురగొన్నారు.
రుబీనా బజ్వా ప్రముఖ పంజాబీ నటి నీరూ బజ్వా సోదరి. ఆమె కూడా కెనడియన్ పౌరురాలు. పంజాబీ చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడు పనిచేస్తోంది. 2018లో సర్గి చిత్రంతో ఆమె తన నట జీవితాన్ని ప్రారంభించింది . ఈ చిత్రంలో ఆమె చేసిన పనికి నటి అనేక అవార్డులను అందుకుంది.
ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం కెనడా పౌరుడిగా సుదీర్ఘకాలం ఆ దేశ పాస్ పోర్ట్ కలిగి ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఆయన మళ్లీ భారతీయ పాస్ పోర్ట్ అందుకొని, భారతీయ పౌరుడిగా మారాడు.