Gangamma Jatara: గంగమ్మ జాతర అసలు కథ ఇదే.. పుష్ప-2లో అల్లు అర్జున్ ధరించిన చీర వెనుక ఇంత రహాస్యం ఉందా..?
పుష్ప సినిమాలో హైలెట్గా నిలిచిన సీన్స్ లో గంగమ్మ జాతర సీన్ ఒకటి. అయితే గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ కట్టుకున్న చీర వెనుక ఏదో రహస్యం ఉందని మీకు తెలుసా..? అవును.. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. 900 ఏళ్ల క్రితం పాలెగాళ్లు అని ఉండేవారు. ఆ పాలెగాడు కామాంధుడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలాత్కరించేవాడు.
వాడికి తెలియకుండా ఎవరికైనా అమ్మాయికి పెళ్లి చేస్తే నరికేసేవాడు. ఈ అరాచకాన్ని ఆపడానికి "అవిలాల" అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవడంతో తన యవ్వనంలో ఎంతో అందంగా ఉంటుంది. ఈ దుర్మార్గుడి కళ్ళు ఆ అమ్మాయి మీద కూడా పడి, ఆమెను కూడా బలాత్కరించే ప్రయత్నం చేయడంతో గంగమ్మ కోపంతో నిన్ను ఐదు రోజుల్లో చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది.
దాంతో భయపడి ఎక్కడో దాక్కునేస్తాడు. గంగమ్మ ఐదు రోజులు ఐదు మారు వేదాలు ధరించి వాడిని వెతుకుతూ ఉంటుంది. ఐదవ రోజు దొరవేశం అనే విచిత్రమైన వేషాన్ని ధరించి, బూతులు మాట్లాడుతూ మగ గొంతుతో అరుస్తూ ఉంటుంది. అప్పుడు వాడు బయటకు రాగానే తల నరికేస్తుంది. అదే మాతంగి వేషం.
ఈ ఐదు వేషాల్లో ఒక వేషమే పుష్ప -2 లో అల్లు అర్జున్ వేసిన మాతంగి వేషం. ఏది ఏమైనా ఈ పాత్ర వెనుక ఇంత కథ ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.