Strawberry Moon Photos: ఆకాశంలో అద్భుతం, కనువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్ ఫొటో గ్యాలరీ
Strawberry Moon Photos: ఈ ఏడాది సంభవించిన రెండు గ్రహణాల తరువాత ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. స్ట్రాబెర్రీ మూన్ ప్రపంచ వ్యాప్తంగా కనుల విందు చేసింది. జూన్‌లో సంభవించే లేదా వసంత రుతువులో ఏర్పడే చివరి పౌర్ణమిని స్ట్రాబెర్రీ మూన్ లేదా సూపర్ మూన్ అని వ్యవహరిస్తారు. అమెరికాలో స్ట్రాబెర్రీ పంట చేతికి వచ్చే సమయం కావడంతో దీనిని స్ట్రాబెర్రీ మూన్‌గా పిలుచుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో స్ట్రాబెర్రీ మూన్ లేదా 2021 చివరి సూపర్ మూన్‌ను వీక్షించారు. (Photos Credit: Twitter)
ఒడిశాలోని పూరీలో స్ట్రాబెర్రీ మూన్ కనువిందు చేసింది. (Photos Credit: Twitter/ANI)
పర్యాటక రాష్ట్రం గోవాలోని పనాజీలో ఈ ఏడాది చివరిదైన సూపర్ మూన్ ఆకాశంలో కనిపించగానే తమ కెమెరాల్లో బంధించారు. (Photos Credit: Twitter)
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో స్కాట్స్‌బరో సిటీ పార్క్ నుంచి తీసిన స్ట్రాబెర్రీ మూన్ ఫొటో. (Photos Credit: Twitter)
యూకేలోని సోమర్సెట్‌లో కనువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్. జూన్ నెలలో ఈ ఏడాది చివరి సూపర్ మూన్ ఏర్పడుతుంది. (Photos Credit: Twitter)
అమెరికాలోని మిచిగాన్ సరస్సు నుంచి స్ట్రాబెర్రీ మూన్ ఇలా దర్శనమిచ్చింది. (Photos Credit: Twitter)
ఇండియాలోని యూపీ, గ్రేటర్ నోయిడాలో స్ట్రాబెర్రీ మూన్‌ను ఇలా క్లిక్ మనిపించారు. (Photos Credit: Twitter)