Sugar Control: ఈ ఎండు ఆకు దెబ్బకు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.. ఎలాగో తెలుసా?
బిర్యానీఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, ఐరన్ ఉంటుంది అయితే ఈ బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల ప్రాణాంతక షుగర్ వ్యాధి కూడా చెక్ పెట్టవచ్చు.
నిపుణుల సలహా మేరకు బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండటం జరిగిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే మీరు కూడా సరైన ఎక్సర్సైజ్ డైట్ నిర్వహిస్తూ ఈ బిర్యానీ ఆకు డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
బిర్యానీ ఆకుని వంటల్లో వినియోగించడం వల్ల రుచి పెరుగుతుంది. డయాబెటిస్ పేషెంట్స్ బిర్యానీ ఆకును నానపెట్టి ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని పరగడుపున తీసుకోవాలి ఇలా చేయడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది
అంతేకాదు ఈ బిర్యానీ ఆకు కడుపు సమస్యలను కడుపునొప్పి మలబద్ధకం, యాసిడిటీ వంటి సమస్యలకు పరి ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా తొలగిపోతాయి
బిర్యానీ ఆకు తో తయారు చేసిన నూనె కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య కూడా చెక్ పెట్టవచ్చు. బిర్యానీ ఆకు నూనెను కండరాలపై రుద్దుకోవటం వల్ల జాయింట్ పెయిన్ సమస్య కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)