Sunil Bharti Mittal: విదేశాల్లో రాజవైభవం.. ఎయిర్‌టెల్ సునీల్ భారతీ మిట్టల్ పిల్లల కథ ఇది..ఇంతకీ ఆయన ఆస్తి ఎంతో తెలుసా?

Wed, 25 Dec 2024-12:45 pm,

Sunil Bharti Mittal Net Worth: భారతదేశంలోని అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటి భారతీ ఎయిర్‌టెల్‌. భారతీ ఎయిర్ టెల్ ..సునీల్ భారతీ మిట్టల్ వ్యవస్థాపకులు.  సునీల్ భారతీది  పంజాబ్ లోని లూధియా. ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ,ఒక  కుమార్తె ఉన్నారు. మీరు ముగ్గురు కూడా విదేశాల్లోనే స్థిరపడ్డారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయ బిలియనీర్లలో వీరి కుమార్తె కూడా ఉన్నారు. సునీల్ భారతీ మిట్టల్ కుమార్తె పేరు ఈషా భారతి పస్రిచా. ఇద్దరు కుమారులు కవిన్ భారతి మిట్టల్, శ్రావిన్ మిట్టల్. 

ఈషా భారతి పస్రిచా.. లండన్ లో స్థిరపడ్డారు. లండన్‌లో గ్లోబల్ బ్రాండ్‌ల లైఫ్ స్టైల్ బ్రాండ్లపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. కవిన్ భారతి మిట్టల్, శ్రావిన్ మిట్టల్ టెలికాం రంగంలో తన సత్తాచాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవిన్ భారతి మిట్టల్ హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, CEO కూడా. సునీల్ మిట్టల్ రెండవ కుమారుడు శ్రవీణ్ మిట్టల్ 2010లో భారతీ ఎయిర్‌టెల్‌లో మేనేజర్‌గా ఉన్నారు. అంతకు ముందు  

అతను న్యూయార్క్‌లోని మెర్రిల్ లించ్, లండన్‌లోని ఎర్నెస్ట్ & యంగ్‌తో కలిసి పనిచేశాడు. కోట్లాది ఆస్తులకు యజమాని అయిన సునీల్ మిట్టల్ పిల్లలు భారతదేశంలోనే పెరిగారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు.  ఆ తర్వాత వారంతా అక్కడే స్థిరపడ్డారు.   

ఇషా పస్రిచా లైఫ్ స్టైల్ ఇన్వెస్టర్. లండన్ సభ్యుల క్లబ్ మైసన్ ఎస్టేల్  ఆర్టిస్టిక్ డైరెక్టర్ కూడా. ఆమె ఫ్యాషన్ లేబుల్ రోక్సాండా, టెక్ బ్యూటీ బిజినెస్ బ్యూటీస్టాక్ వంటి విభిన్న బ్రాండ్లలో ఇన్వెస్ట్ చేస్తూ రాణిస్తున్నారు. ఇషా అనేక వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు భారతి ఫౌండేషన్  ట్రస్టీల బోర్డు సభ్యురాలు కూడా.  ఆమె, ఆమె భర్త శరణ్ పస్రిచా లండన్‌లో నివసిస్తున్నారు. వారికి ఒక కూతురు,కుమారుడు ఉన్నారు. శరణ్ పస్రిచా లైఫ్ స్టైల్ హాస్పిటాలిటీ సంస్థ ఎన్నిస్మోర్ వ్యవస్థాపకుడు.  

స్కాట్లాండ్‌లో పుట్టి భారతదేశంలో పెరిగిన ఇషా భారతి పస్రిచా తన బాల్యాన్ని స్కాట్‌లాండ్‌లో తన తాతయ్యలతో గడిపింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో  36 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఫోటోలను షేర్ చేయడం తన ఫాలోవర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇషా భర్త శరణ్ పస్రిచా నిజానికి భారతీయ పారిశ్రామికవేత్త. అతను జీవనశైలి ఆతిథ్య సంస్థ ఎన్నిస్మోర్‌ను కూడా నడుపుతున్నాడు.  

ఇషా బ్రిటన్‌లోని బాత్ యూనివర్శిటీ నుండి పాలిటిక్స్, ఇటాలియన్ , ఫ్రెంచ్‌లలో పట్టభద్రురాలు. పారిస్‌లోని లూయిస్ విట్టన్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా ఏడాదిపాటు పనిచేశారు. లైఫ్ స్టైల్ ఇన్వెస్టర్ అయిన ఇషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇషా భర్త శరణ్ పస్రిచా 2015లో స్కాట్లాండ్‌లోని ప్రసిద్ధ గ్లెనీగల్స్ లగ్జరీ హోటల్‌ను కొనుగోలు చేశాడు.కాగా సునీల్ భారతి మిట్టల్ నికర విలువ 1,180 కోట్ల అమెరికన్ డాలర్లు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link