Use of firecrackers in Telangana: తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
బాణసంచా విషయంలో హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీం కోర్టు (Supreme court ).. రాష్ట్రంలో టపాసులపై ఆంక్షలు విధించే క్రమంలో ఎన్జీటీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గాలినాణ్యత సూచీల ఆధారంగానే టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
వాయు కాలుష్యం తీవ్రత అధిక స్థాయిలో ఉన్నచోట టపాసులపై పూర్తి నిషేధం ( Ban on firecrackers ) విధించాలన్న ధర్మాసనం.. గాలినాణ్యత సాధారణ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో 2 గంటలపాటు గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు అనుమతిచ్చింది.
సాధారణ కాలుష్య ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గాలి కాలుష్యానికి దారితీయని గ్రీన్ క్రాకర్స్ ( Green crackers ) కాల్చుకోవచ్చు అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఫైర్‌వర్క్స్ డీలర్స్ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది.

ఫైర్‌వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. జస్టిస్ ఖాన్ విల్కర్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.
దీపావళితో పాటు రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సైతం ఇవే ఆంక్షలు వర్తించనున్నట్టు సమాచారం.
దీపావళి పండగ నేపథ్యంలో పటాసులు విక్రయాలు, పటాసుల వినియోగంపై సుప్రీం కోర్టు తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.