Isha Foundation: సుప్రీంకోర్టులో సద్గురు జగ్గీ వాసుదేవ్ కు భారీ ఊరట..
Supreme Court Dismessess Cast Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడులోని కోయంబత్తూరు వేదికగా జగ్గీ వాసువేద్ ఆధ్వర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈషా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు ఉచిత విద్యతో పాటు పేదలకు వైద్య సేవలు అందిస్తూ..ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజిక పరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది.
అంతేకాదు ప్రకృతి విపత్తుల సమయంలో ఈషా ఫౌండేషన్ తరుపున సహాయ కార్యక్రమాలు అందిస్తూ సామాజిక సేవలో ఎపుడు ముందు ఉంటుంది జగ్గీ వాసుదేవ్. తాజాగా సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా నమోదైన కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
రీసెంట్ గా తన ఇద్దరు కూతుళ్లను సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ వారు బయట ప్రపంచానికి రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ జరిపింది. ఈ విచారణలో సదురు ఇద్దరు మహిళలు ఈషా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉంటునున్నారి పోలీసులు కోర్టుకు తెలిపారు.
అంతేకాదు దానికి సంబంధించిన పూర్తి డీటెల్స్ ను కోర్టుకు సమర్పించారు. పోలీసులు సమర్పించిన ఆధారాల నేపథ్యంలో సుప్రీంకోర్టు సద్గురు ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఏదో ఉగ్రవాదులు, తీవ్రవాదులను తనిఖీలు చేసినట్టు దాదాపు 150 మంది పోలీసులు ఈషా ఫౌండేషన్ లో తనిఖీలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది.
చర్చిలు, మదర్సాల జోలికి వెళ్లిన కోర్టులు, ప్రభుత్వాలు.. సామాజిక, హిందూ ఆధ్యాత్మిక సేవలు చేస్తూ మంచి పేరు గడించిన సద్గురు ఆశ్రమంపై ఈ రకంగా దాడి చేయడాన్ని పలు హిందూ సంఘాలు ఖండించాయి.
ఈ నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ కేసుు మద్రాసు హై కోర్టు నుంచి సుప్రీంకోర్టు బదిలీ అయింది. దీనిపై ఇటీవలే కోర్టు విచారణ చేపట్టింది. ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉంటున్న మహిళల వాంగ్మూలాన్ని బట్టి ఆ ఆశ్రమంలో స్వచ్చందంగానే మనస్ఫూర్తిగానే ఆశ్రమంలో ఉంటున్నట్టు కోర్టు విచారణలో తేలింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది.