Ants Amazing Facts: చీమలు పడుకోవని, వినలేవని మీకు తెలుసా
చీమ అద్భుతమైన, ఆసక్తికరమైన అతి చిన్న జీవి. చీమకు చాలా ప్రత్యేకతలున్నాయి. అన్నింటికంటే ముందు చెప్పుకోవల్సింది ఇవి పడుకోవు. ఇవి మిగిలిన జీవులకు బిన్నంగా పడుకుంటాయి. చిన్న చిన్న బ్రేక్స్‌లో పడుకుంటాయి. ఒకేసారి ఎక్కువసేపు పడుకోవు
చీమ శరీరంలో దాదాపుగా 2.5 లక్షల న్యూరాన్స్ ఉంటాయి. ఇవి కణాల ద్వారా మెదడుకు పని చెబుతుంటాయి. మెదడు పనిచేయించేందుకు పడుకోవల్సిన అవసరముండదు.
చీమలు నిజంగానే అద్భుతమైనవి. ప్రత్యేకించి బరువు మోయడంలో వీటికివే సాటి. ఇవి తమ బరువు కంటే 20 రెట్లు ఎక్కువ మోయగలవు.
చీమలు శ్రమ జీవులు. సమిష్టిగా కలిసి పనిచేస్తాయి. ప్రతి చీమకు ఓ ప్రత్యేకమైన పని ఉంటుంది. ఇవి ఒంటరిగా ఉండవు. ఎప్పుడూ అన్నీ కలిసే ఉంటాయి.
చీమలకు చెవులుండవు. ఇవి తమ కాళ్ల సహాయంతో భూమిపై ఉండే ప్రకంపనాలను పసిగడతాయి. చీమల జాయింట్స్, కాళ్లలో కొన్ని ప్రత్యేకమైన సెన్సార్లు ఉంటాయి. వీటి సహాయంతో చుట్టూ జరుగుతున్నవి పసిగడతాయి
చీమలు శ్రమ జీవులు, సంఘ జీవులు. రాణి చీమ వీటిలో చాలా ప్రత్యేకమైంది. వీటికే పవర్ ఎక్కువ.