Surya Gochar 2024: తులారాశిలోకి సూర్య సంచారం.. దీపావళికి ముందు ఈ రాశికి విలాసవంతమైన జీవనం, పట్టిందల్లా బంగారం..
గ్రహాలు ఒక్కో రాశిని మార్చినప్పుడు ఒక్కో విధంగా ప్రభావం ఇస్తాయి. కొన్ని రాశులకు మంచి జరిగితే మరికొన్ని రాశులకు అశుభం. తులారాశిలో సూర్య సంచారం ప్రభావం కొన్ని నెలలపాటు ఉంటుందట. ఈ కాలంలో ఎండలు తక్కువగా ఉంటాయి. వర్షాలు కూడా అధికంగా కురవడం ఖాయం. కానీ, సూర్య ప్రభావం ఏమాత్రం తగ్గదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని అనుగ్రహంతో విలాసవంతమైన జీవనం సాగించే రాశులు ఉన్నాయి. ఈ సమయంలో వీరు అద్బుతమైన లాభాలు పొందుతారు. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి...
మీన రాశి.. తులా రాశిలోని సూర్య సంచారం వల్ల మీనరాశివారికి లవ్ లైఫ్ బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలను గడిస్తారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. మొత్తానికి ఈ కాలం మీన రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు.
మకర రాశి.. సూర్యగ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఆర్థిక లాభాలు గడిస్తారు. మొత్తానికి ఈ సమయం మకర రాశి వారికి కూడా అదృష్టాన్ని తీసుకువచ్చే సమయం.
వృశ్చిక రాశి.. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కూడా కలిసి వచ్చే కాలం. ఆరోగ్యం బాగుపడుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త అవకాశాలను ఈ సమయంలో అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు కూడా మంచి సమయం. మొత్తానికి సూర్య సంచారం వల్ల వృశ్చిక రాశివారు కూడా భారీ లాభాలు పొందుతారు.
కన్యా రాశి.. తులా రాశిలోకి సూర్య సంచారం వల్ల కన్యా రాశివారికి కూడా లక్కీ సమయం. వారిలో ఆధ్యాత్మిక భావన కూడా పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది.
కర్కాటక రాశి.. ఈ రాశివారికి కూడా సూర్య సంచారం మంచి కాలం. మనస్సులో ఎన్నో రోజుల నుంచి ఎదురవుతున్న చింతన తగ్గిపోతుంది. వృత్తిపరంగా పేరు ప్రతిష్టలు పొందుతారు. కర్కాటక రాశివారికి కూడా సూర్య సంచారం బాగా అదృష్టాన్ని తీసుకువచ్చే సమయం.
వృషభ రాశి.. ఈ సమయంలో వృషభ రాశివారు కూడా బాగా లాభాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రానిస్తారు. సూర్య సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)