Brown Rice: బ్రౌన్ రైస్ దివ్యౌషధం.. షుగర్ రోగులకు వరం..!
బ్రౌన్ రైస్ తినడం ద్వారా బరువుని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది రిఫైన్డ్ చేయరు. అలాగే వైట్ రైస్ లో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి కావాల్సిన పౌష్టికాలు లభించవు. బ్రౌన్ రైస్ లో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.కావున బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ స్థాయిలు పేగు కదలికలను నియంత్రించడంలో పేగు కదలికలను సక్రమంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మలబద్ధకం నయం చేయటంలో అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది.
అదే వైట్ డ్రెస్ వచ్చేసరికి పైపొట్టు తీసి లోపల ఉన్నటువంటి హస్క్ కూడా తీసేస్తారు. ఓన్లీ ఎండ్స్ మాత్రం ఉంటుంది. లోపలి నుంచి పూర్తిగా పోయేసరికి అది కేవలం కార్బోహైడ్రేట్ మాత్రమే మిగులుతుంది. అదే బ్రౌన్‌రైస్లో కేవలం పైన హస్కే తీస్తారు. అది కూడా కొంచెం కొంచెంపోతుంది.దీంట్లో మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ వ్యాల్యూ ఉంటుంది.
సాధారణంగా వైట్ రైస్‌లో కార్బోనేట్ లెవల్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ పోతుంది. జీర్ణమైపోయి మన బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగే ఛాన్స్ చాలా ఉంటాయి. కానీ బ్రౌన్‌రైస్ అంత తొందరగా జీర్ణం కాదు. చాలా టైమ్ పడుతుంది. దాని వల్ల మీ షుగర్ లెవల్స్ పెరగవు.
బ్రౌన్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండెకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ లో లిగ్నాన్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )