Tata Curvv EV Features: స్టైలిష్ స్పోర్ట్స్ డిజైన్, అధునాతన ఫీచర్లతో Tata Curvv Ev లాంచ్ ఎప్పుడంటే

Wed, 31 Jul 2024-6:05 pm,

Tata Curvv Infotainment System

ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్, 9 స్పీకర్ సరౌండెడ్ సిస్టమ్ ఉన్నాయి. 

Tata Curvv EV Design

టాటా కర్వ్ ఈవీ అనేది స్టైలిష్, స్పోర్ట్స్ లుక్ కారు. ఇందులో ఫ్లాష్ డోర్ హ్యాండిల్, 18 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్, వాయిస్ యాక్టివేటెడ్ పనోరమిక్ సన్ రూఫ్, స్పేషియస్ బూట్ స్సేస్ ఉన్నాయి. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రీమియం కారు లుక్ ఉంటుంది.

Tata curvv EV Interior Features

ఈ కారు ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్దిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. వైర్ లెస్ ఛార్జింగ్, మల్టిపుల్ వాయిస్ అసిస్టెన్స్ , లెదర్ సీట్లు ఉంటాయి. రేర్ పార్కింగ్ కెమేరాతో పాటు డైనమిక్ గైడ్ లైన్ కూడా ఉంది.

Tata Curvv EV Security Features

సెక్యూరిటీ కోసం ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, డిస్క్ బ్రేక్, ఆటో హోల్డ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఈఎస్పీ, డ్రైవర్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 

Tata curvv EV Performance

టాటా కర్వ్ ఈవీలో శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా వీ టు వీ, వీ టు ఎల్ టెక్నాలజీ ఉంది. దీంతో మరో కారుకు ఛార్జింగ్ ఇవ్వవచ్చు ఇంట్లోని పవర్ తీసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link