Tata Avinya EV: కళ్లు చెదిరే డిజైన్, స్టైలిష్ లుక్స్ Tata Avinya EV సొగసు చూడతరమా
TATA AVINYA Looks
టాటా అవిన్యా ఈవీ కారు చూస్తుంటే పదే పదే చూడాలన్పిస్తోంది. అత్యంత ఆకర్షణీయంగా టెస్లా కారులా కన్పిస్తోంది. ఇదొక హై ఎండ్, లగ్జరీ, మోస్ట్ కంఫర్టబుల్ కారు కానుంది. టాటా మోటార్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న కారు ఇది
TATA AVINYA EV Mileage
ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అది కూడా కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదే బెస్ట్ అనే చర్చ నడుస్తోంది.
TATA AVINYA అంటే అర్ధం
AVINYA అనేది సంస్కృతి పదం. దీనర్ధం Innovation. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అనుసంధానించి రూపొందించారు.
TATA AVINYA Design
బటర్ ప్లై డోర్లు ఈ అవిన్యా కారు ప్రత్యేకతల్లో ఒకటి. 3వ జనరేషన్ ఎలక్ట్రిఫికేషన్ తో ఈ కారు తయారైంది. అవిన్యా కారును స్క్రీన్ లెస్ విదానంలో రూపుదిద్దుకుంది. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత
TATA AVINYA concept
Minimise, Maximise, Optimise టాటా అవిన్యా కారును తీసుకురావడంలో టాటా మోటార్స్ కాన్సెప్ట్ ఇదే. ప్రస్తుతం అందుబాటులో అన్ని ఎలక్ట్రిక్ కార్లతో ఇదే టాప్ అండ్ హై ఎండ్ కానుంది
TATA AVINYA Price
TATA AVINYA కారు ప్రారంభ ధర 30 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఇందులో హై ఎండ్ కారు అయితే 60 లక్షల రూపాయలుండవచ్చు.
TATA AVINYA launch
అందరిలో ఆసక్తి, ఆతృత రేపుతున్న ఈ కారు 2025 అంటే వచ్చే ఏడాది జూన్ నెలలో మార్కెట్లో రావచ్చని అంచనా ఉంది.