Tata Punch Vs Tata Punch Ev: టాటా కార్లు కొనేవారు ఈ రెండింటి తేడాలు తప్పకుండా తెలుసుకోండి!
సాధరణ టాటా పంచ్ కారు పెట్రోల్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక టాటా పంచ్ ఈవీ మాత్రం పూర్తి ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అయ్యింది. అంతేకాకుండా కొత్త పంచ్ వివిధ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
టాటా పంచ్ కారు ధర వివరాల్లోకి, ఇది రూ.5.49 లక్షల నుంచి రూ.9.09 లక్షలతో అందుబాటులో ఉంది. ఇక టాటా పంచ్ ఈవీ వేరియంట్ రూ.10.99 లక్షల నుంచి రూ.13.99 లక్షలతో లభిస్తోంది.
టాటా పంచ్ సాధరణ వేరియంట్ 18.97 కి.మీ/లీ (పెట్రోల్) మైలేజ్‌తో లభిస్తోంది. ఇక టాటా పంచ్ ఈవీ వేరియంట్ మాత్రం ఒక్క సారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ మైలేజ్‌తో లభిస్తోంది.
టాటా పంచ్ వేరియంట్ పనితీరు విషయానికొస్తే, 1.2L పెట్రోల్ ఇంజన్, 86 PS శక్తి, 113 Nm టార్క్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. టాటా పంచ్ ఈవీ వేరియంట్, 40 kW ఎలక్ట్రిక్ మోటార్, 130 PS శక్తి, 260 Nm టార్క్ ఫీచర్స్‌తో లభిస్తోంది.
సాధరణ టాటా పంచ్ ఎలాంటి ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక టాటా పంచ్ ఈవీ కారు.. 100% ఛార్జ్ కావడానికి 5 నుంచి 6 గంటలు (AC ఛార్జర్‌తో)తో అందుబాటులోకి వచ్చింది. ఇది 26.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
టాటా పంచ్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్‌తో లభిస్తోంది. ఇక టాటా పంచ్ ఈవీ వేరియంట్ కూడా పై ఫీచర్స్‌తో పాటు రిజెనరేటివ్ బ్రేకింగ్, ఎకో మోడ్‌లను కలిగి ఉంటుంది.