Shardul Thakur: శార్దుల్ ఠాకూర్ పెళ్లి ఫొటోలు.. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గదుగా..
శార్దుల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. 15 నెలల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి వివాహ కార్యక్రమాలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ఈ జంట ఏడడుగులు వేసింది.
అందంలో స్టార్ హీరోయిన్స్‌తో పోటీ పడుతోంది మిథాలీ పారుల్కర్. ఆమె వ్యాపారవేత్త కాగా.. థానేలో ఆల్ ది బేక్స్ పేరుతో స్టార్టప్ కంపెనీని నడుపుతోంది. మిథాలీతో శార్దూల్ ఠాకూర్ చాలా కాలంగా డేటింగ్ చేశాడు.
వీరి హల్దీ వేడుక శనివారం జరిగింది. రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, భార్య ధనశ్రీ వర్మ కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు.
టీమిండియా తరుఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు శార్దుల్ ఠాకూర్.
ఇప్పటివరకు 34 వన్డేలు, 25 టీ20లు, 8 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కేవలం బాల్‌తోనే కాకుండా.. బ్యాట్‌తో కూడా రాణించగల సత్తా శార్దుల్‌కు ఉంది.