Cricket Marriages: క్రికెట్‌లో పెద్దోళ్లైనా...భార్యల కంటే వయస్సులో చిన్నోళ్లే

Mon, 14 Feb 2022-1:48 pm,

సురేష్ రైనా-ప్రియాంక చౌధరి... ఈ ఇద్దరి వయస్సు 5 నెలల 9 రోజులుంది. సురేష్ రైనా చిన్నోడు. 2015లో ఈ ఇద్దరి పెళ్లైంది. 

శిఖర్ ధావన్- ఆయెషా ముఖర్జీలు 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య పదేళ్ల వ్యత్యాసముంది. ఆయేషా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు విడాకులు తీసుకుని ఉంది. అయితే గత ఏడాది ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ..హసీన్ జహాను వివాహమాడాడు. ప్రస్తుతం ఈ ఇద్దరికీ విడాకులు కూడా అయిపోయాయి. అయితే మొహమ్మద్ షమీ కంటే హసీన్ ఏకంగా పదేళ్లు పెద్దది. విడాకుల తరువాత ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

సచిన్ టెండూల్కర్-అంజలి మెహతా. అంజలి కంటే సచిన్ టెండూల్కర్ ఆరేళ్ల చిన్నోడు. ఇద్దరు పిల్లలున్నారు. 1995లో ఈ ఇద్దరి వివాహమైంది.

జస్‌ప్రీత్ బూమ్రా - సంజనా గణేశన్. 2021 మార్చ్ 15వ తేదీన ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుమ్రా..సంజనా కంటే 2 ఏళ్ల 7 నెలలు చిన్నోడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link