Teeth Pain Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా, ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం
ఇంగువ
ఇంగువ మరో అద్భుతమైన పరిష్కారం. ఇంగువతో పంటి నొప్పి క్షణాల్లో మాయమౌతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు నొప్పిని హరిస్తాయి. కొద్దిగా ఇంగువను నీళ్లలో కలిపి తాగాలి.
వేడి నీళ్లలో కాపరం
పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వేడి నీళ్లతో కాపరం పెడితే చాలా త్వరగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉప్పు నీళ్లతో గార్లింగ్ కూడా చేయవచ్చు.
ఆవాల నూనె
ఆవాల నూనెతో పళ్లకు మస్సాజ్ చేయడం మంచి ఉపశమనం ఇస్తుంది. పంటి నొప్పుల్ని దూరం చేసేందుకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
పచ్చి వెల్లుల్లి
పచ్చి వెల్లుల్లి కూడా పంటి నొప్పికి అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సమస్యల్నించి కాపాడుకునేందుకు రోజు 1-2 వెల్లుల్లి రెమ్మలి తినాలి.
లవంగం
పంటి నొప్పుల్నించి ఉపశమనం పొందేందుకు లవంగం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అనాదిగా వాడుకలో ఉన్న చిట్కా ఇది. రోజూ పళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగం పంటి కింద నొక్కి పెట్టి ఉంచుకుంటే చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.