TG Tenth Fees: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు డేట్‌ను పొడిగించిన విద్యాశాఖ..
తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో పదవ తరగతి ఎగ్జామ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు టెన్త్ ఎగ్జామ్ ను ఎంతో సీరియస్ గా తీసుకుంటుంటారు.
అయితే... విద్యాశాఖ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 18 తో ఫీజు గడువు ముగియనుంది. దీంతో మరో రెండు రోజులు చాన్స్ అన్నమాట. దీంతో మళ్లీ ఈ ఎగ్జామ్ డేట్ ను తాజాగా, విద్యాశాఖ పొడిగించింది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ.. మళ్లీ ఎగ్జామ్ ఫీజ్ గడువును సవరిస్తు మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సవరణ ప్రకారం.. నవంబరు 28 వరకు ఎలాంటి ఆలస్యం రుసుము లేకుండా ఫీజు కట్టవచ్చన్నమాట.
ఎస్ ఎస్ సీ, వోకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్ లకు హజరుకావాలనుకుంటే.. రెగ్యూలర్, ప్రైవేటు ఒకసారి ఫెయిల్ అయిన వాళ్లు సైతం..ఈ చాన్స్ ను ఉపయోగించుకొవచ్చని విద్యాశాఖ తెలిపింది.
గతంలో ప్రధానోపాధ్యాయుడికి ఇస్తే.. ఆయన బ్యాంక్ కు వెళ్లి చలాన్ లు తీయాల్సి వచ్చేది ... కానీ ఇప్పుడు.. నేరుగా ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లించే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఎస్ ఎస్ సీ సైట్ ను చూడాలని కోరినట్లు తెలుస్తొంది.