School Holiday Cancel: ఆరోజు స్కూళ్లకు సెలవు క్యాన్షిల్.. నాలుగు రోజుల సెలవుల్లో బిగ్ ట్విస్ట్.. కారణం ఏంటంటే..?
కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు.
ఇప్పటికి కూడా కొన్నిప్రాంతాలు ఇంకా వరద ముప్పులోనే ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వరద ముంపుకు గురైనట్లు తెలుస్తోంది. రెండు స్టేట్స్ ల సీఎం లు.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సైతం.. రంగంలోకి దిగి అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.
వరద ముంపు ప్రభావితమైన ప్రజలకు సహాయం అందిస్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా తన వంతుగా అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా భారీ వానల వల్ల అనేక సందర్భాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో స్కూళ్లలో సిలబస్ కాక.. టీచర్ లు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు..సెప్టెంబర్ 14 రెండో శనివారం, తదుపరి ఆదివారం, ఇలా రెండు రోజులు వచ్చాయి. మరల సెప్టెంబరు 16 న మిలాద్ ఉన్న నబీ కాబట్టి.. ఆ రోజు కూడా సెలవు ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17 న నిమజ్జనం ఆరోజు..ఎలాగైన హలీడే ఉంటుంది. ఈ నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ పండుగను.. 16 కు కాకుండా.. 17 వ తేదీన జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
దీంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సిలబస్ ను అవ్వట్లేదు కనుక.. 16 వ తేదీన ఉన్న స్కూళ్ల హలీడేను క్యాన్షిల్ చేసింది. ఆ రోజు యథాప్రకారం స్కూళ్లు నడుస్తాయని కూడా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా సెలవులు రావడంతో చాలా మంది అనేక ప్లాన్ లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కానీ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయంతో మాత్రం.. వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడినట్లు సమాచారం. మరోవైపు వాతావరణ కేంద్రం.. రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా మరల వరుణుడి గండం ఉందని కూడా హెచ్చరించింది.