Face Recognition: సచివాలయ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి షాక్.. అమల్లోకి కఠిన నిర్ణయం
భారీ షాక్: ప్రభుత్వ ఉద్యోగుల విషయమై తెలంగాణ ప్రభుత్వం రోజురోజుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా హాజరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త విధానం: ఉద్యోగానికి వచ్చిన సమయం.. వెళ్లే సమయం తప్పనిసరిగా నమోదు చేస్తూ ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
అప్పటి నుంచి: ఈనెల 22వ తేదీ శుక్రవారం నుంచి సచివాలయంలో పని చేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
బయోమెట్రిక్: సచివాలయంలోని ప్రతి అంతస్తులో ప్రవేశ ద్వారాల వద్ద ఫేషియల్ రికగ్నైజేషన్ మిషన్ ఏర్పాటు చేసింది.
తప్పనిసరి: ఉద్యోగులు సచివాలయానికి రాకపోకల సమయంలో తప్పనిసరిగా హాజరు వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
అందరికీ: ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ వర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరైనా: ఆఫీసర్ల నుంచి క్లర్క్, ఆఫీస్ సబార్డినేట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కచ్చితంగా ఫేస్ రెకగ్నిషన్‌తో హాజరు కావాలని సర్క్యులర్ విడుదలైంది.