Telangana SSC Exams: తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్ ఇదే! ఏ రోజు ఏ పరీక్ష.. ఏ సమయం?
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది.
పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్ పరీక్షలు ఉండనున్నాయి.
26న మ్యాథ్స్, 28న ఫిజిక్స్, 29న బయోలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ పరీక్షలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
పరీక్షలకు కొన్ని వారాల ముందు హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది.
పరీక్ష విధానంలో మార్పులు తెస్తూ మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.
కేసీఆర్ హయాంలో ఉన్న మాదిరి యథావిధిగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.