Neeraj Chopra Net Worth: ఈ గోల్డెన్‌ బాయ్‌కు ఇప్పటికే రూ.37,00,00,000 ఆస్తులు.. కళ్లు చెదిరే కార్‌ కలెక్షన్లు..

Thu, 08 Aug 2024-8:10 pm,

అవును ఇప్పుడు కూడా ఈ కుర్రాడిపైనే అందరి ఆశలు పెట్టుకున్నారు. అయితే, 2024 కొన్ని నివేదికల ప్రకారం నీరజ్‌ చోప్రా ఆస్తులు రూ. 37.6 కోట్లు.   

కొన్ని నివేదికల ప్రకారం జావెలిన్‌ క్రీడాకారుడిగా ప్రతి ఏటా రూ.4 కోట్లు తీసుకుంటారు. ఇది అతడి సంపదలో కేవలం 10 శాతం మాత్రమే. ఇది కాకుండా వివిధ సంస్థలకు ఎండార్స్‌మెంట్‌ చేస్తూ ఆయన సంపాదిస్తాడు. దీని వల్ల కొన్ని రివార్డులు కూడా పొందుతారు.  

టోక్యో ఒలింపిక్స్‌లో గెలుపొందిన తర్వాత నీరజ్‌ చోప్రా కెరీర్‌ మలుపు తిరిగింది. ఒక రేంజ్‌లో గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో నీరజ్‌ను ఎన్నో రివార్డులు వరించాయి. ఈయన ఒలింపిక్స్‌లో గెలిచిన తర్వాత ఎంత సంపాదించారు తెలుసుకుందాం.  

హరియాణా ప్రభుత్వం రూ.6 కోట్లు, ఇండియన్‌ రైల్వే రూ.3 కోట్లు, పంజాబ్‌ ప్రభుత్వం రూ.2 కోట్లు, బైజూస్‌ రూ. 2 కోట్లు, బీసీసీఐ రూ. కోటీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి రూ. కోటీ పొందారు. ఇది కాకుండా నీరజ్‌ చోప్రాకు పంజాబ్‌ ప్రభుత్వం గ్రేడ్‌ 1 ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ప్రకటించింది. అంతేకాదు ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ ఫ్రీ ట్రావెల్‌ను సదుపాయాన్ని కల్పించింది.  

ఇక గోల్డ్‌ గెలిచిన తర్వాత ప్రముఖ టాప్‌ బ్రాండెడ్‌ కంపెనీలకు ఎండార్సిమెంట్ చేస్తున్నారు. అండర్‌ అర్మోర్‌ 2023 క్రీడాకారుతో డీల్‌ చేసుకుంది. అంతేకాదు నీరజ్‌ ఎవరెడీ బ్యాటరీ, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్, మజిల్‌బ్లేజ్‌, లిమ్కా, ఒమెగా, బ్రిటానియా, ప్రొటెక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, మొబిల్‌ ఇండియాకు ఎండార్స్‌మెంట్‌ చేస్తున్నారు  

హరియాణాలోని ఖాంద్రా పానిపత్‌లో ఈయనకు మూడు అంతస్తుల భవనం ఉంది. వీళ్లది ఉమ్మడి కుటుంబం. నీరజ్‌ చోప్రా వద్ద ఉన్న కార్‌ కలెక్షన్స్‌ చూస్తే మైండ్‌ బ్లో అవుతుంది. ఈయనకు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఉంది. దీన్ని మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా బహుమతిగా ఇచ్చారు. ఫోర్డ్‌ మస్తాంగ్‌ జీటీ, రేంజ్ రోవర్‌ స్పోర్స్‌, టయోట ఫార్చూనర్‌ ఉన్నాయి. ఇవి కాకుండా హ్యార్లీ డేవిడ్స్‌సన్‌ 1200 రోడ్‌స్టర్, బజాజ్‌ పల్సర్‌ 220 ఎఫ్ కూడా ఈయన కలెక్షన్స్‌లో భాగం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link