Bank Holidays In August: వచ్చేనెల బ్యాంకులు 13 రోజులు బంద్ ఉంటాయి.. ఎందుకో తెలుసా?
జూలై మాసం ముగియనుంది. బ్యాంకుకు సంబంధించిన పనులు ఏవైనా ఉంటే ముందుగానే ముగించుకోండి ఎందుకంటే రానున్న ఆగస్టులో ఎక్కువ రోజులపాటు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఇక ప్రతి రెండో నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులకు ఎలాగో సెలవులు ఈ నేపథ్యంలో బ్యాంకులకు దాదాపు 13 రోజులపాటు సెలవులు రానున్నాయి.
ఆగస్టు మొదటివారం.. ఈనెల మొదటివారంలో ఆగస్టు 4 ఆదివారం రానుంది. ఈ రోజు బ్యాంకుకు సెలవు అంతే కాదురెండో శనివారం 10వ తేదీన రానుంది. ఈరోజుల్లో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 15వ తేదీ రెండో వారంలో రానుంది. ఈరోజు అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు సెలవు. ఆదివారం 11వ తేదీ రానుంది ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 18వ తేదీ ఆదివారం రానుంది బ్యాంకులకు సెలవు. ఇక 19వ తేదీ రాఖీ పౌర్ణమి ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు. ఈరోజుల్లో బ్యాంకులకు సెలవు కాబట్టి ముందుగానే మీ బ్యాంకు పనులు ముందుగానే ముగించుకోండి.
ఇక 24 నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. ఆదివారం 25వ తేదీ మరుసటి రోజు 26 సోమవారం సందర్భంగా బ్యాంకులకు సెలవు రానుంది.