Digestion Problem: తిన్నది అరగడం లేదా? అయితే ఈ వ్యాయామాలు చేయండి..!!

Mon, 29 Jul 2024-9:06 pm,

Digestion Problem  Solution : నేటికాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో తిండి కంటే బయటే ఎక్కువగా తింటున్నారు. అంతేకాదు సమయానికి తినకపోవడమూ ఒక కారణమే అని చెప్పాలి. అర్థరాత్రి వరకు మేల్కోవడం కూడా జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ఇవన్నీ కూడా మీరు తిన్న ఫుడ్ అరగదు. తిన్నది అరగడకపోవడంతో ఏదోలా ఉంటుంది. ఏ పనిచేయాలనిపించదు. నీరసంగా ఉంటుంది. అలాంటి వారు కొన్ని వ్యాయామాలు చేస్తే శరీరంలో  కొవ్వు తగ్గడంతోపాటు తిన్నది చక్కగా అరుగుతుంది. ఆ వ్యాయామాలేంటో చూసేద్దామా?   

ఈ వ్యాయామం యోగా మ్యాట్ పై నిలబడి చేయాలి. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. అంతేకాదు చేతులు, వీపును బలంగా ఉంచుతుంది. తల నుంచి కాల వరకు పుష్ అప్ స్థానంలో ఉండి చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొవ్వు కూడా తగ్గుతుంది.   

మనం చేసే కొన్ని వ్యాయామాలకు తప్పనిసరిగా యోగా మ్యాట్ ఉండాలి. ఈ వ్యాయామం కూడా యోగా మ్యాట్ పై నిల్చుండి చేయాలి. ఇది మొత్తం శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.   

ఈ వ్యాయామం చేస్తే కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. వారానికి రెండు, మూడు సార్లు ఈ వ్యాయామం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.   

లెగ్ లిఫ్ట్ వ్యాయామం పొత్తికడుపు ఎముకలను బలంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి వ్యాయామం ఇది. ఈ వ్యాయామం చేస్తే జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.   

ఈ వ్యాయామాలు వారానికి కనీసం 3 లేదా 4 సార్లు చేయాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంతోపాటు గుండె, జీర్ణక్రియ, రక్తనాళాలను సాఫీగా ఉంచేలా సహాయపడతాయి. 

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా ఉండాలి. ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. నిద్రతోపాటు శరీరానికి కావాల్సిన నీరు కూడా అందించాలి. జీవక్రియకోసం మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలంటే రోజంతా నీరు తాగాలి. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link