HomeRemedies to Keep Snakes Away: ఈ 2 వంటగది వస్తువులతో పాములు పరార్‌.. మీ ఇంటి దరిదాపుల్లోకి రావు..

Wed, 21 Feb 2024-11:26 am,

పాములు విషజీవులు. ఏటా ఎంతోమంది ఈ విషసర్పాల వల్ల చనిపోతున్నారు. పాములు మన ఇంటి చుట్టూ రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలు ఉన్నాయి.అలాగే రెండు వంటగది వస్తువులతో పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి రాకుండా పారిపోతాయి. అవేంటో తెలుసుకుందాం.  

మీ ఇంటివంటగదిలో ఉండే ఉల్లి, వెల్లుల్లి చాలు. పాములను తరిమికొట్టడానికి ఆ ఘాటు వాసనకు అవి దూరంగా పారిపోతాయి.  

ఎందుకంటే ఇవి పాములకు వికర్షంగా పనిచేస్తాయి. ఇవి పిల్లులు, కుక్కలు ఉండని ప్రాంతంలో చల్లాలి. అంటే పెంపుడు జంతువులు ఉండని ప్రాంతంలో ఈ వికర్షలు ఉపయోగించండి.  

ఉల్లి, వెల్లుల్లి రెండూ పాములకు పడవు. ఈ రెండు కలిపి శక్తివంతమైన ద్రావణాన్ని తయారు చేయాలి.  

ఈ ద్రావణం సిద్ధం చేయడానికి రెండు ముక్కలుగా కట్ చేయాలి. వీటిని ఓ 5 నిమిషాలు ఉడకబెట్టి, కొన్ని గంటపపాటు పక్కనబెట్టాలి.  

వడకట్టి స్ప్రే బాటిల్‌లోకి వేసుకోవాలి. ఇది మీ ఇంటి చుట్టూ తోటలో స్ప్రే చేయాలి. ప్రభావవంతంగా పనిచేయడానికి ఇందులో కాస్త రాళ్ల ఉప్పు కలపి చల్లుకోండి.   

అంతేకాదు మీ ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. రాతికుప్పలు, అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కలను తొలగించండి. మీ ఇంటి సమీపంలో నీటి వనరులు ఉండే పాములకు ఆవాసాలుగా మారతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link