Heroine: సీఎం కొడుకుతో ఎఫైర్.. కొరియోగ్రాఫర్ తో డేటింగ్..ఇప్పుడు దర్శకుడికి భార్య.. ఎవరంటే..?
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక హీరోయిన్ తన అందంతో, నటనతో మేనరిజంతో దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తాను నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సాధారణంగా ఎవరికైనా సరే వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. కానీ ఈమెకు మాత్రం వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతోంది అని చెప్పాలి.
ఇక ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ నయనతార. అందరికీ వయసు పెరిగితే నయనతార వయసు రివర్స్ అవుతుంది. మొదటి సినిమా కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా హీరోయిన్ కెరియర్ గ్రాఫ్ ఇండస్ట్రీలో కొంతకాలమే ఉంటుంది. కానీ ఈమె మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది నయనతార. ఈమె తీసుకునే పారితోషకం కూడా ఎక్కువే. ఒక్కో సినిమాకి దాదాపు రూ.12 కోట్లు తీసుకుంటూ రికార్డు సృష్టించింది. అంతేకాదు రూ.183 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చెన్నై బ్యూటీ కి హైదరాబాదులో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. చెన్నైలో కూడా రూ.100 కోట్లకు విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈమె నానుమ్ రౌడీధాన్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కొడుకులు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. వివాహానికంటే ముందే స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపినట్లు సమాచారం.
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన శింబుతో, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవాతో రిలేషన్ లో ఉంది. అలాగే తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ తో కూడా ఈ బ్యూటీ ఎఫైర్ నడిపిందని అంటూ ఉంటారు.ఇప్పుడు దర్శకుడితో పెళ్లి చేసుకొని సెటిలైపోయింది ఈ ముద్దుగుమ్మ