Money: ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..బిడ్డ పెళ్లికి 70లక్షలు..పూర్తి వివరాలివే

Tue, 19 Nov 2024-3:54 pm,

Govt Scheme: మహిళలు, ఆడబిడ్డల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించడం ఇంతలోనే పెళ్లీడు రావడంతో లక్షల ఖర్చు చేసి ఆమెకు పెళ్లి చేయడం సామాన్యుడికి పెనుభారంగా మారింది. అయితే పేదవాళ్లపై ఇలాంటి భారం పడకూడదన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం   సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమును తీసుకువచ్చింది.   

ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన ప్రాజెక్టు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది వార్షిక చక్రవడ్డీ రేటు అని చెప్పవచ్చు. ఈ స్కీం కేవలం బాలికలకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించింది. ఈ స్కీమ్ అకౌంట్ తెరవడం ద్వారా కుమార్తె ఉన్న విద్య, వివాహం కోసం భారీగా డబ్బు కూడబెట్టవచ్చు. ఈ స్కీముకు సంబంధించి ప్రధాన అంశాలను ఇప్పుడు చూద్దాం 

సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా తమ కుమార్తెకు 10ఏళ్లు నిండే వరకు ఖాతా తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఒక కుటుంబంలోఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కవలలు అయితే 2ఏళ్ల కంటే ఎక్కువ ఖాతాలు తీసుకోవచ్చు.   

అకౌంట్ తీసుకున్న తేదీ నుంచి గరిష్టంగా 15ఏళ్ల వరకు ఈస్కీముకు సహకారం అందించవచ్చు.ఇన్వెస్టర్ తన కుమార్తె పుట్టిన వెంటనే ఈ స్కీములో అకౌంట్ తీసుకున్నట్లయితే అతను 15ఏళ్ల పాటు అకౌంట్లో డబ్బు జమచేయాలి. దీని తర్వాత 6ఏళ్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ వడ్డీ అనేది పెరుగుతూనే ఉంటుంది. 

ఈ స్కీములో కుమార్తెకు 18ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు మెచ్చూరిటీ మొత్తంలో 50శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. బాలికకు 21ఏళ్లు వచ్చిన తర్వాత మిగిలిన డబ్బును విత్ డ్రా చేయవచ్చు . ఈ స్కీములో ఏడాదికి 1.50లక్షల వరకు పెట్టుబడులపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.   

ఈ పథకం ఈఈఈ హోదాతో వస్తుంది. పెట్టుబడి మొత్తం వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదు. ఈ స్కీములో ఒక ఆర్థిక ఏడాది కనీసం రూ. 250. గరిష్టంగా రూ. 150,000 డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పెట్టుబడిని వాయిదాలు లేదా ఏకమొత్తంలో చేసుకోవచ్చు. 70లక్షల రూపాయలు ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు.   

ఉదాహరణకు ఎవరైనా 2024లో సుకన్య సమృద్ధి యోజనలో ఆ అమ్మాయికి ఏడాది వయస్సు ఉన్నప్పుడు అకౌంట్ తీసుకుంటే..ఒక ఆర్థిక ఏడాదికి రూ. 1,50,000 పెట్టుబడిపెడితే 20245లో మెచ్యూరిటీ సమయంలో మొత్తంరూ. 69, 27,578పొందవచ్చు. పెట్టుబడి మొత్తం రూ. 22,50,000కాగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ. 46, 77, 578. ఇది బిడ్డ పెళ్లికి  ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link