Tirumala News: తిరుమలకు వెళ్తున్నారా..?.. తిరుగు ప్రయాణంలో ఈ పని మర్చిపోకుండా చేయాలంట.. మీకు ఈ విషయం తెలుసా..?
తిరుమల శ్రీవారిని కలియుగంలో కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా చెప్తుంటారు. కొంత మంది కాలీనడకన వస్తుంటే.. మరికొందరు దివ్యదర్శనం, స్పెషల్ దర్శనం టోకెన్లతో స్వామి వారి ఆలయంకు వస్తుంటారు.
శ్రీవారి దర్శనం కోసం ఎంతసేపైన క్యూలైన్ లలో నిల్చొని ఉంటారు. అంతే కాకుండా.. స్వామి వారిని కన్నులారా చూసేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు. ఇదిలా ఉండగా. . ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చినట్లు తెలుస్తొంది.
ఇటీవల టీటీడీకి నూతన పాలక వర్గంను సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ నాయుడు ప్రస్తుతం టీటీడీకి చైర్మన్ గా ఎంపికయ్యారు. అదే విధంగా.. సీఎం చంద్రబాబు సైతం.. వీఐపీ సేవల్లో తరించకూడదని అన్నారు.
సామాన్యుడే ఫస్ట్ ప్రయారిటీగా స్వామి వారి దర్శనం అయ్యేలా చూడాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తిరుమలలో టీటీడీ కూడ అనేక మార్పుల్ని తీసుకొచ్చిందని చెప్పుకొవచ్చు. అయితే.. తిరుమలల ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషిధ్దమని తెలిసిందే.
అదే విధంగా తిరుమలకు వెళ్లేటప్పుడు.. టీటీడీ రూ. 50 లకు... గాజు గ్లాస్ ను భక్తులకు అందిస్తుంది. దాన్ని తీసుకుని భక్తుల కొండ మీదకు వెళ్తుంటారు. అయితే.. చాలా మంది తిరుగు ప్రయాణంలో ఆ గాజు గ్లాసును తమతో పాటు ఇంటికి తీసుకెళ్తుంటారు.
కానీ అలాకాకుండా.. తిరుగు ప్రయాణంలో ఏ షాపులో అయిన ఆ గాజు గ్లాసును ఇస్తే.. తిరిగి రూ. 30 రిటర్న్ ఇచ్చేస్తారంట. అంటే.. కేవలం రూ. 20 లకు మాత్రమే టీటీడీ ప్యూర్ , శుభ్రమైన నీటిని భక్తులకు అందిస్తుందన్న మాట. ఈ విషయం చాలా మంది భక్తులు తమకు తెలిదని అంటుంటారు.