Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారం మాదిరిగా భావిస్తారు. తిరుమలను దర్శించుకునేందుకు ప్రతిరోజు దేశ , విదేశాల నుంచి వేలాదిగి భక్తులు తరలి వస్తుంటారు.
కంటి నిండా స్వామి వారిని దర్శించుకునేందుకు పరితపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో ప్రతిరోజు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా స్లాట్ లు ఉంటాయి. కొంత మంది నెల రోజులు, రెండు నెలలకు ముందు కూడా టికెట్ లను బుక్ చేసుకుంటారు.
మరికొందరు మాత్రం వీఐపీ దర్శనాల సిఫారసు లెటర్ లతో తిరుమలకు వస్తుంటారు. మెయిన్ గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసుల్ని తీసుకుని దర్శనం కోసం చాలా మంది తిరుమలకు వస్తుంటారు.
ఇటీవల కాలంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగ జరిగిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డు వివాదం ఉన్న కూడా తిరుపతికి భక్తులు భారీగా తరలిస్తునే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తిరుమలలో ఈ నెల 31 న బ్రేక్ దర్శనాల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టొబరు 31న దీపావళి పండుగ నేపథ్యంలో ఆరోజు స్వామివారికి విశేషంగా కైంకర్యాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది.
అందుకు అక్టొబరు 30 వ తేదీన ఎవరైన భక్తులు 31 కోసం వీఐపీ సిపారసుల లేఖలు తీసుకుని వస్తే మాత్రం తీసుకొలేమంటూ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పటికే ఆరోజున వీఐపీ సిఫారసుల లెటర్లు తీసుకున్న భక్తులకు మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.