Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 2025 ఫిబ్రవరి కోటా విడుదల ఇలా వెంటనే బుక్ చేసుకోండి..
తిరుమల శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి టీటీడీ అధికార యంత్రాంగం విడుదల చేస్తుంది. 2025 ఫిబ్రవరి కోటా కూడా విడుదల చేస్తోంది.
తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం భాగ్యం కలుగాలేని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. రోజూ వేల మంది భక్తులు శ్రీవారి దర్శనార్ధం బారులు తీరుతుంటారు... స్వామివారిని కనులారా చూసి తిలకిస్తారు. వారి మొక్కులు తీరుస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.
అయితే వచ్చే ఏడాదికి సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను తిరుమల యంత్రాంగం నేడు 18వ తేదీ సోమవారం విడుదల చేయనుంది... నవంబర్ 21వ తేదీన ఆర్థిజ బ్రహ్మోత్సవం, స్వామివారి కల్యాణోత్సవం ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
2025 ఫిబ్రవరి కోటా టిక్కెట్లను 21వ తేదీ విడుదల చేస్తారు. అలాగే 23వ తేదీ అంగప్రదిక్షిణం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు... 23వ తేదీ శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు కూడా విడుదల చేస్తారు.23వ తేదీ వయోవృద్దులు, దివ్యాంగులకు దర్శనం టిక్కెట్లు పొందవచ్చు.
ఇక వచ్చే ఏడాదికి సంబంధించిన 25న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు టీటీడీ విడుదల చేయనుంది... అదేరోజు మధ్యాహ్నం గదుల కోటాను కూడా బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎటువంటి ఆటంకాలు కలుగుకుండా శ్రీవారి దర్శనం సులభంగా చేసుకోవచ్చు.