Tirumala News: తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం కేవలం 30 నిమిషాల్లోనే.. వేంకటేశ్వరస్వామిని సులభంగా చూసే సూపర్ ఛాన్స్!
సాధారణంగా శ్రీవారి దర్శనం చేసేందుకు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు, అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తూ సర్వదర్శనం టికెట్లు తీసుకొని వెళ్తాం. అయినా కానీ గంటల తరబడి బారులు తిరిగి ఎదురు చూడక తప్పదు. ఈ క్రమంలో వృద్ధులు పిల్లలు, పెద్దలు అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో అరగంటలోనే శ్రీవారిని దర్శనం చేసుకునే బంపర్ ఆఫర్.
తిరుమల దర్శనానికి వెళ్తున్న వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ యంత్రాంగం బంపర్ ఆఫర్ ప్రకటించింది వీరికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రత్యేక దర్శనం కల్పించి కేవలం అరగంటలోనే శ్రీవారి దర్శనానికి అనుమతించనుంది ప్రకటించింది.
ఈ దర్శనం ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆఫర్ ఉపయోగించి రెండు లడ్డులు కూడా మీతో పాటు తీసుకెళ్లొచ్చు. ఇలా వృద్ధులకు ఏ ఇబ్బందులు లేకుండా టిటిడి యంత్రాంగం ఈ చర్యకు చేపట్టింది.
అయితే ఈ దర్శనానికి అనుమతి పొందాలంటే 65 సంవత్సరాలు తప్పనిసరిగా నిండి ఉండాలి. లేదా గుండె, చికిత్స, మూత్రపిండాల చికిత్స స్ట్రోక్ ఆస్తమా ఉన్నవారు కూడా అర్హులు. ఒకవేళ మీ అమ్మ, నాన్న, అమ్మమ్మలు ఎవరైనా నడవలేని పరిస్థితిలో ఉంటే వారితో పాటు ఇంకొకరు వెళ్లడానికి కూడా బంపర్ ఆఫర్ ఉంది.
కానీ ఈ దర్శనం చేసుకోవడానికి మీతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఒకవేళ దివ్యంగులయితే హాండీక్యాప్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా తీసుకొని వస్తేనే ఈ దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు సర్జన్ లేదా స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ తో రావాలి.
అయితే ఈ దర్శనానికి ముందుగానే సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది దీనికి ఎటువంటి చార్జీ అవసరం లేదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)