Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?
తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ మేల్కొలపడానికి పారాయణ చేసే సుప్రభాత సేవను తిరుమలలో తాత్కాలికంగా నెల రోజులపాటు నిలిపి వేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా టీటీడీ ప్రకటించింది. తిరుమలలో వచ్చే నెల జరగనున్న వేడుకల జాబితాను విడుదల చేసింది టీటీడీ.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్డీ భారీగా పెరిగింది. దర్శనానికి దాదాపు 13 గంటలపాటు సమయం పడుతుంది. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 56 వేలమందికి పైగా దర్శించుకున్నారు.
అయితే, వచ్చే నెల డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఈ మాసంలో సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పారాయణ చేసే ఆచారం ఉంది. ఇదే ప్రతి ఏడాది కొనసాగుతుంది.
తిరుమలలో 2025 జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు. అంటే వీఐపీ దర్శనాలు మినహాయించి వృద్ధులు, దివ్యాంగులకు అందించే ప్రత్యేక దర్శనాలు తాత్కాలికంగా పది రోజులపాటు నిలిపి వేయనున్నారు.
ఇదిలా ఉండగా ఈనెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల కోటా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు టీటీడీ యంత్రాంగం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, రూమ్ బుకింగ్స్‌లో కూడా ఇబ్బందులు కలుగుకుండా ప్రత్యేకంగా పీఏసీ భవనం కూడా నిర్మాణాలు చేపడుతుంది టీటీడీ.