Tirumala: ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్తున్నారా.. అయితే మీకో శుభవార్త..!

Mon, 21 Oct 2024-1:31 pm,

తిరుమల తిరుపతి స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే.  ఇక స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్న నేపథ్యంలో శీఘ్రదర్శనం జరగక గంటల తరబడి కంపార్ట్మెంట్లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

దీనికి తోడు ప్రత్యేక దర్శనం , సేవా టికెట్లను రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి.. ఒకవేళ ఉచిత దర్శనానికి వెళ్తే రోజంతా క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి . అందుకే 300 రూపాయల దర్శనం టికెట్లు లేనివారు గంటలపాటు క్యూలైన్లో ఎదురుచూస్తున్నారు .

అలాంటి వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు ఆన్లైన్ ద్వారా.. పరిమిత సంఖ్యలో 300 రూపాయలకే శీఘ్రదర్శన టిక్కెట్లు అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లేదంటే కనీసం ఎస్ఎస్డి టోకెన్ అయినా ఉండాలి. ఎలాంటి టోకెన్,  టికెట్ లేకుండా కూడా ఇప్పుడు శ్రీవారిని దర్శించుకోవాలంటే.. గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడాల్సి ఉంటుంది. 

అలా కాకుండా టిక్కెట్లు ఆన్లైన్లో చాలామంది కొనుగోలు చేస్తారు..అలా అక్కడ కూడా టికెట్ దొరకని వారు తిరుమలకు వెళ్లి అక్కడ.. నేరుగా టైం స్లాట్ సర్వదర్శనం టికెట్లు పొందవచ్చు.  దీనికి కేవలం ఐదు గంటలు మాత్రమే సమయం పడుతుంది.  

దీనికోసం చేయవలసినది ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లడమే. అక్కడ బస్ టికెట్ తో పాటు శ్రీవారి దర్శనం టికెట్లు కూడా సులభంగా పొందవచ్చు. ఏపీఎస్ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ కూడా ఈ టికెట్లను అందజేస్తోంది.. తెలంగాణలోనే వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి టిఎస్ఆర్టిసి బస్సులు నడుపుతున్న నేపథ్యంలో.. వారిలో రోజు వెయ్యి మంది ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు అందుబాటులో ఉంచారు. ఈ సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవడానికి వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది.

ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్..అలాగే ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్‌ https://www.apsrtconline.in/ ద్వారా లేదా టీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్‌ https://tgsrtc.telangana.gov.in/ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇలా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి సులభంగా టికెట్లు పొంది త్వరగా దర్శనం చేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link