Jobs In Tirumala: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. తిరుమల దేవస్థానంలో భారీగా ఉద్యోగాలు.. టీటీడీ కీలక ప్రకటన..!
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తుంటారు. స్వామి వారి కోసం ఎంతో దూరం నుంచి, గంటల కొద్ది కంపార్ట్ మెంట్లలలో వేచి చూస్తుంటారు. స్వామి వారి కోసం ఎన్నో వ్యయప్రయాసాలకు లోనౌతుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీటీడీ పాలక మండలి సమావశం నిర్వహించినట్లు తెలుస్తొంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇటీవల అన్నమయ్య భవన్ లో సమావేశం నిర్వహించింది. దీనిలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.
ముఖ్యంగా టీటీడీలో వైద్యవిభాగాల్ని బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. అదేవిధంగా.. డాక్టర్ లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.
అదేవిధంగా రోజు రోజుకు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగిపోవడంతో.. అన్నదానంలో పాల్గొనే సిబ్బందిని సైతం పెంచేందుకు.. ఉద్యోగాల కల్పనను నిర్వహించి శాశ్వతంగా జాబ్ లు క్రియేట్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
తిరుమలలో ఫుడ్ సెఫ్టీ విభాగం, నిరంతరం ఎక్కడ కూడా ఎలాంటి లోటు పాట్లు కల్గకుండా చర్యలు తీసుకునే విధంగా టీటీడీ విజిలెన్స్ ను కూడా బలోపేతం దిశగా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిపై తొందరలోనే పాలక మండలి పోస్టులు, ఇతర వివరాలను వెల్లడిస్తుందని కూడా టీటీడీ ఒక ప్రకటనలనో చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే టీటీడీ గంటలోపే స్వామివారి దర్శనం ఏఐ టెక్నాలజీతో కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. వసతులు, హోటల్స్, రెస్టారెంట్ల విషయంలోనే కూడా.. అనేక చర్యలు తీసుకునే దిశగా టీటీడీ ముందుకు వెళ్తుందని తెలుస్తొంది.