Tirumala News: శ్రీవారి భక్తులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్.. అక్కడ కూడా ఇక మీదట ఉచిత దర్శనం టోకెన్లు..

Thu, 14 Nov 2024-10:30 am,

తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా అనుకుంటారు. అందుకు  ఎక్కడెక్కడి నుంచి స్వామి వారి దర్శనం కొసం వస్తుంటారు. ఎన్నిగంటలైన క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుంటారు

ఇటీవల ఏపీలో కూటమి సర్కారు తిరుమలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తొంది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఇటీవల టీటీడీ బోర్డును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు.  

అంతే కాకుండా.. తిరుమల లడ్డులో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనే ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అంతే కాకుండా..ఈ ఘటన రాజకీయంగా దుమారంగా మారిన విషయం తెలిసిందే. అయిన కూడా తిరుమలకు వస్తున్న భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొవచ్చు.  

అయితే.. తిరుమలకు భక్తులు ఆన్ లైన్ లో ప్రతినెల టికెట్ల బుకింగ్స్ చేసుకుంటారు. మరికొందరు నేరుగా వచ్చి టీటీడీలోని పలు ప్రాంతాలలో సుదర్శన చక్రం టోకెన్ లను తీసుకుంటారు. ఆఫ్ లైన్ లలో మెట్ల మార్గం వద్ద కూడా టోకెన్ లను అందిస్తారు.  

అదే విధంగా తిరుమల రైల్వే స్టేషన్ సమీపంలో కూడా తిరుమల టోకెన్లను ఇస్తుంటారు. అయితే.. ప్రస్తుతం టీటీడీ భక్తులకు మరొ గుడ్ న్యూస్ చెప్పింది.ఇక మీదట.. గతంలో మాదిరిగా మళ్లీ శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ లను ప్రారంభించినట్లు తెలుస్తొంది.  గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తొంది. 

అందుకే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజూ 900 శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలుస్తొంది.  ఇప్పుడు.. ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తొంది. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ  అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తొంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link