Tirumala Update: 10 కంపార్టుమెంట్లలో భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
శ్రీవారి సర్వదర్శనం కోసం నిన్నటి నుంచి వేచి ఉన్న భక్తులకు దర్శనం కోసం ఏకంగా 8 గంటల సమయం పడుతున్నట్లు.. సమాచారం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇక గత రెండు రోజులు సెలవులు కావడంతో.. ఈ భక్తుల రద్దీ కాస్త ఎక్కువైంది. దీంతో కంపార్టుమెంట్లలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది.
నిన్న తిరుమలలో 82,233 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సంఖ్య ఈరోజు అనగా.. కార్తీక సోమవారం మరింత పెరగడం గమనార్హం. దాంతో ఆలయ సిబ్బంది భక్తుల దర్శన ఏర్పాట్లను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు.
నిన్న శ్రీవారి హుండీ..ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చింది. ఇది భక్తుల సమర్పణతో వచ్చే రాబడి కావడం..టిటిడి ధర్మకర్తలు ఈ మొత్తాన్ని ఆలయ నిర్వహణ కోసం ఉపయోగిస్తారు.. అన్న విషయం తెలిసిందే.
ఇక ఈరోజు విషయానికి వస్తే..ప్రస్తుతం తిరుమలలో 10 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి అని సమాచారం. భక్తులు శ్రీవారి దర్శనం కోసం చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోందట. ఈ రద్దీలో కూడా ఆలయ అధికారులు సమర్థవంతంగా.. ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
కాగా 300 టికెట్లు క్యూ వారికి కూడా కంపార్ట్మెంట్స్ లో వెయిట్ చేయాల్సిన అవసరం తప్పడం లేదు. వారికి కూడా దర్శనం ఏకంగా నాలుగు గంటల పైనే పడుతోంది. పక్కన నడకదారి భక్తులకు.. దర్శనం ఐదు గంటల పాటు.. సర్వదర్శనం వారికి ఏకంగా ఎనిమిది గంటల పాటు పడుతోంది.