Gold Rate Today In India: గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో గత రెండు వారాలుగా బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా క్షీణించాయి. బంగారం ధర క్షీణించగా.. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.490 మేర పతనమైంది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,090 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000కి పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Price in Delhi) మరోసారి పతనమయ్యాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.370 మేర దిగొచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,440 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,150కి క్షీణించింది.
బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు (Silver Rate in India) దిగొస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.59,600 వద్ద మార్కెట్ అవుతోంది. వెండి ధర దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది.
Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు
బులియన్ మార్కెట్‌పై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ముడి చమురు, అంతర్జాతీయంగా బంగారం ధరలు, డాలర్ మారకం రేటు లాంటి పలు అంశాల కారణంగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి.
Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి