Gold And Silver Price: మహిళలకు బంగారు కాలం.. ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర
ఈరోజు ధర: వారం రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
భారీగా పతనం: కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,210 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,110 పతనమైంది.
వెండి ధర: వెండి ధర భారీగా తగ్గుదల వచ్చింది. కిలో వెండిపై రూ.1,600 తగ్గిపోయింది. వారం కిందట 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.3,830 తగ్గింది.
ప్రధాన నగరాల్లో: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,340కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,640 వద్ద కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా..: బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పై ధరల్లో ఉన్నాయి. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,490, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,790 ఉంది.
వెండి ధరలు: హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.98,900 ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులలో కిలో వెండి రూ.89,400 వద్ద కొనసాగుతోంది.
ధరలు తెలుసుకోవడం ఇలా..: శుక్రవారం ఉదయం 6 గంటలకు నమోదైన ధరలను ఇక్కడ చూడవచ్చు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే 8955664433 అనే ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.